News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Similar News
News April 5, 2025
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.
News April 5, 2025
HYD: ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

HYDలో విషాదం నెలకొంది. కవాడిగూడలోని సీసీజీవో టవర్స్‌లోని 8వ అంతస్తు నుంచి కిందకు దూకి ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మిగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 5, 2025
రాజేంద్రనగర్: మంచి దిగుబడినిచ్చేది ఆముదం ఐసీహెచ్-5

తక్కువ నీరు ఉన్నా అధిక దిగుబడులు సాధించేలా ఆముదం ఐసీహెచ్-5 రకం విత్తనాన్ని అభివృద్ధి చేశామని ఐసీఎఆర్-ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.మాధుర్ పేర్కొన్నారు. శుక్రవారం భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో మాట్లాడుతూ.. ఈ సంకర జాతి విత్తనం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగలదన్నారు. ఎకరాకు 5-6 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడి ఇస్తుందన్నారు.