News January 16, 2025
బేతంచర్లలో పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య
ఇంటి ముందు కల్లాపు చల్లుకునే పేడ రంగు తాగి మహిళ మృతి చెందిన ఘటన బేతంచెర్ల మండలం పెండేకల్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టాల మహేశ్వరి(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగును నీటిలో కలుపుకొని తాగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించి కేసు నమోదు చేశారు.
Similar News
News January 17, 2025
కర్నూలుకు పెట్టుబడుల క్యూ.. కారణమిదే!
☞ ఓర్వకల్లు విమానాశ్రయం ఉండటం
☞ ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో అందుబాటులో భూమి
☞ హైదరాబాద్- బెంగళూరు నగరాలకు మెరుగైన రవాణా సౌకర్యం
☞ సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం
☞ నీటి వనరుల అనుకూలం
☞ సంస్థలకు త్వరితగతిన అనుమతులు
☞ ఓర్వకల్లు విమానాశ్రయంలోని రన్వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకునే అవకాశం
☞ కర్నూలు ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ <<15167493>>మంత్రిగా<<>> ఉండటం
News January 17, 2025
ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632
ఆదోని మార్కెట్లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.
News January 17, 2025
గోనెగండ్లలో విషాదం
కర్నూలు జిల్లా గోనెగండ్లలో మందు బాబులు ఓ వ్యక్తి ప్రాణం తీశారు. పూటుగా తాగి బైక్పై వెళ్తూ స్టేట్ బ్యాంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆటో డ్రైవర్ రమేశ్ను ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో బంధువులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రమేశ్ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.