News September 24, 2024
బేతంచెర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బేతంచెర్ల మండలం ముచ్చట్ల దేవాలయానికి వెళ్లే రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన యువకులు బైకుపై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంచే శ్రీనివాసులు(22) అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News November 4, 2025
లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎస్సై శివాంజల్‌తో కలిసి పరిశీలించారు. తుంగభద్ర నది తీరంలో పుణ్య హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీ మఠం అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సై శివాంజల్‌కు సూచించారు.
News November 4, 2025
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ.7,555

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
News November 4, 2025
జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.


