News August 27, 2024
బేస్తవారిపేట: రేపు జాబ్ మేళా
బేస్తవారిపేటలోని కందుల ఓబులరెడ్డి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కందుల ఓబులరెడ్డి తెలిపారు. అమెజాన్, బ్లూస్టార్, టెక్ మహీంద్ర, పేమెంట్ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, ఫ్లిప్ కార్ట్, డీమార్ట్, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టా కార్ట్, హంటర్ డౌగ్లాస్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు.
Similar News
News September 11, 2024
ప్రకాశం: జిల్లాలో రైతుల చూపు నర్సరీల వైపు
ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి నారు, మొక్కలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పడినంత కష్టం లేకుండా ప్రైవేట్ నర్సరీల నుంచి తెచ్చుకుంటున్నారు. దీని వల్ల సమయం, ఖర్చు కలిసివస్తుందని, నారు ఒకే ఎత్తులో ఉంటుందని, నాణ్యతగా ఉంటాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 2023-24 మధ్య మిరప 95,129 ఎకరాల్లో, టమోటా 1746 ఎకరాల్లో సాగైనట్లుగా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు.
News September 11, 2024
నేడు దోర్నాలకు రానున్న కలెక్టర్
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం దోర్నాల మండలంలో పర్యటించనున్నట్లు మంగళవారం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు మండలంలోని చిన్న గుడిపాడు సమీపంలో గల ఆర్డీటి కార్యాలయంలో నిర్వహించే పీఎం-జన్ మన్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు.
News September 10, 2024
వరద బాధితులకు రూ.10.60 కోట్లు విరాళం: మంత్రి గొట్టిపాటి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో సీఎంను ఆ శాఖ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరోజు జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దాదాపు 10.60 కోట్ల రూపాయలను వరద బాధితుల సహాయార్థం అందించారని మంత్రి చెప్పారు. అలాగే విద్యుత్ పునరుద్ధరణలో ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారని అన్నారు.