News August 26, 2024

బేస్తవారిపేట వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

బేస్తవారిపేట వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. బేస్తవారిపేటకు చెందిన సుభాని అనే వ్యక్తి బైక్ అదుపు తప్పి సెంటర్‌లోని సైడ్ రైలింగ్‌ను ఢీకొన్నాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108లో ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Similar News

News April 19, 2026

మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు.. జాగ్రత్త: SP

image

ప్రకాశం జిల్లా SP మైనర్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తెలియక వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని SP సూచించారు.

News April 19, 2026

పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

image

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.

News April 19, 2026

కొత్తపట్నం బీచ్‌లో మృతదేహం.. పచ్చబొట్టే ఆదారం

image

కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం బీచ్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానిక మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎవరైనా చంపి అక్కడ పడేశారా..? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె చేతిపై P.ఎల్లమ్మ అనే పచ్చబొట్టు ఉంది.