News March 20, 2024
బైండోవర్ కేసుల నమోదుకు పోలీసుల సన్నద్ధం: ఎస్పీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నాయకులు, కార్యకర్తలు, అనుమానిత వ్యక్తులు, నేరచరిత్రుల గుర్తించేందుకు పోలీసు అధికారులు కసరత్తు చేపట్టారు. సదరు వ్యక్తులను గుర్తించి ఐపీసీ106, 107, 108, 109, 110 కింద కేసు నమోదు చేసిన తర్వాత తహశీల్దారు ఎదుట హాజరుపరచనున్నారు.
Similar News
News November 26, 2025
విభిన్న ప్రతిభావంతులు రాణించాలి: డీఈఓ

విభిన్న ప్రతిభావంతులు తాము ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో సాధన చేసి రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. బుధవారం కర్నూల్ అవుట్డోర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. సమన్వయంతో క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి, విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
News November 26, 2025
‘ఆదోని’కి మళ్లీ నిరాశే..!

ఆదోని ప్రాంత ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది. YCP ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆదోనిని జిల్లా చేయాలని ఆ ప్రాంతవాసులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. వారి విజ్ఞప్తిని సర్కార్ పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేర్పులు చేపట్టడంతో మళ్లీ నిరసన గళంవిప్పారు. ఈ ప్రభుత్వం కూడా మొండిచేయి చూపింది. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను కూటమి నాయకులు CM చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
News November 26, 2025
కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.


