News August 6, 2024

బైంసా: మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం బైంసా మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ మారుతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేగాం గ్రామానికి చెందిన గడ్డమత్తుల సుభాష్ (35) మద్యానికి బానిసై మద్యం మత్తులో గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News November 8, 2025

తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

image

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.