News February 3, 2025

బైకుల దొంగ.. పిఠాపురంలోనే 15 కేసులు

image

పిఠాపురం పోలీసులు బైకుల <<15339981>>దొంగను <<>>అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పట్టణంలోని అగ్రహారానికి చెందిన సొంటిని గంగాధర్ అలియాస్ రీసు వెల్డింగ్ పనులు చేస్తూ జల్సాల కోసం ఫేక్ తాళాలతో బైకులు దొంగలిస్తున్నాడు. 48 బైకులను చోరీ చేశాడు. ప్రత్తిపాడు, శంఖవరానికి చెందిన సత్తిబాబు, వీరబాబు, ఆనంద్, లక్ష్మణరావు, నాగ సత్యనారాయణ, చక్రయ్యకు రూ.10 వేలు చొప్పున బైకులు అమ్మాడు. ఇతనిపై ఒక్క పిఠాపురంలోనే 15 కేసులు ఉన్నాయి.

Similar News

News February 10, 2026

కెనడాపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం

image

T20 WC: సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో కెనడా తేలిపోయింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడింది. అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయింది. ధాలీవాల్(64), హర్ష్(33) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి పాలైంది. SA జట్టు 57 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, మార్కో జాన్సన్ 2, రబాడా, బోష్ చెరో వికెట్ తీశారు.

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్ ఆడండి.. పాక్‌కు బంగ్లా రిక్వెస్ట్

image

పాకిస్థాన్ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాకు మద్దతుగా పాకిస్థాన్ నిలబడిన తీరుకు రుణపడి ఉంటాం. నేను నిన్న PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీతో భేటీ అయ్యాను. వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు తెలిపాను. క్రికెట్ మేలు కోసం ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడాలని వారికి విజ్ఞప్తి చేశాను’ అని వ్యాఖ్యానించారు.

News February 9, 2026

BNGR: ఆ 18 కార్డులతో ఓటేయొచ్చు: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు కలెక్టర్ హనుమంతరావు కీలక సూచన చేశారు. ఓటరు కార్డు లేకపోయినా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డు సహా ప్రభుత్వం జారీ చేసిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.