News March 1, 2025

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. ఒకరి మృతి

image

అమరాపురం మండలం ఉదుగూరు గ్రామం వద్ద బైక్‌ను ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. అగ్రహారానికి చెందిన జగదీశ్ తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగదీశ్ మృతిచెందగా మంజునాథ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.

Similar News

News March 15, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

image

*పరీక్షలు ప్రశాంతంగా రాయండి:కలెక్టర్
*పిట్లం: అంగన్వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి:కలెక్టర్
*ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు
*ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలి: SP
*మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP
*సిద్ధ రామేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు షురూ
*అప్పుల బాధతో యువకుడు సూసైడ్
*వసతి గృహాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

News March 15, 2025

సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గ పర్యటనకు ఏర్పాట్లు పూర్తైనట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు.

News March 15, 2025

అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్, కమిషనర్

image

బడ్జెట్ సమీక్షపై అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా బడ్జెట్ రూపకల్పనపై సమర్పించిన అంచనాలు సమీక్షించి అధికారులకు మేయర్, కమిషనర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

error: Content is protected !!