News May 19, 2024
బైక్ను ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

కొవ్వూరు మండలం కాపవరం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నందమూరు- కాపవరం సర్వీసు రోడ్డులో ఓ వ్యాన్, ఎదురుగా వచ్చిన బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కొవ్వూరులోని ఇందిరమ్మకాలనీకి చెందిన పూర్ణసాయి కార్తీక్ మృతి చెందగా.. కరగాని గణేష్, కురందాసు దుర్గ గాయపడ్డారు. వీరిని కొవ్వూరు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేస్తున్నారు.
Similar News
News December 15, 2025
ప.గో: రెండేళ్లకే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’

వయసుకు మించిన జ్ఞాపకశక్తితో తణుకు మండలం ముద్దాపురానికి చెందిన రెండేళ్ల చిన్నారి కొయ్యలమూడి బృహతి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మహాభారతం, వినాయకుని చరిత్ర వంటి ఇతిహాసాలను, ఆధ్యాత్మిక విషయాలను ఈ చిన్నారి అనర్గళంగా చెబుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కుమార్తె ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు గోవర్ధన్, అనూష ఆమెను ప్రోత్సహించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.
News December 15, 2025
సాఫ్ట్బాల్ బాలికల టైటిల్ విజయనగరానికే

రాష్ట్రస్థాయి అండర్-17 స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో విజయనగరం జట్టు బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు నిలిచాయి. పోటీలు ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు ఆర్గనైజింగ్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి దుర్గ ఆదివారం ప్రకటించారు.
News December 15, 2025
సాఫ్ట్బాల్ టైటిల్ ఉమ్మడి పశ్చిమ గోదావరికే

వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్లో మూడు రోజులుగా జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్-17 పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విజేతగా నిలవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. డీఈఓ నారాయణ, జెడ్పీటీసీ జయప్రకాష్ విజేతలకు బహుమతులు అందించారు.


