News April 24, 2024
బైక్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.
Similar News
News April 22, 2025
ఒంగోలు: పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను చట్ట పరిధిలో ఉండడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News April 21, 2025
మార్కాపురం: ❤ PIC OF THE DAY

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ డ్రోన్ ఫొటో పలువురిని ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో భాగంగా డ్రోన్ కెమెరా ఈ ఫొటోను క్లిక్ మనిపించింది. పట్టణంలోని వివిద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న పట్టణ ఫొటోను స్థానికులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
News April 21, 2025
ఒంగోలు: అంగన్వాడీలకు ఐటీసీ కిట్స్

అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఐటీసీ వారు అందచేసిన అసెస్మెంట్ టూల్ కిట్, హబ్ అంగన్వాడీ మాడ్యూల్స్, పోస్టర్స్, బ్రోచర్స్, క్లాస్ మేనేజ్మెంట్ మెటీరియల్‌ను సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ మెటీరియల్‌ను జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.