News April 24, 2024
బైక్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి
పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.
Similar News
News January 17, 2025
ప్రకాశం: నేడే విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శుక్రవారం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. ఈ కార్యక్రమం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీవెన్స్- డే అని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 17, 2025
ప్రకాశం: రాకాసి అలలకు ఓ ఫ్యామిలీ బలి
ప్రకాశం జిల్లా పాకల తీరంలో <<15170746>>నిన్న ముగ్గురు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పొన్నలూరు మండంలం శివన్నపాలేనికి చెందిన మాధవ(25) ఫ్యామిలీ సముద్ర స్నానానికి వెళ్లింది. అలల తాకిడికి మాధవ చనిపోయాడు. ఆయన భార్య చెల్లెలు యామిని(15), బాబాయి కుమార్తె జెస్సిక(14) సైతం కన్నుమూసింది. మాధవ భార్య నవ్య సైతం సముద్రంలోకి కొట్టుకుపోతుండగా.. మత్స్యకారులు కాపాడారు.
News January 17, 2025
బాల్య వివాహలు లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: ప్రకాశం కలెక్టర్
ప్రకాశం జిల్లాను బాల్య వివాహాలు, బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగుల్లో ఒకరికి శిక్షణ ఇచ్చి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.