News February 24, 2025

బైక్ అదుపుతప్పి మందమర్రి వాసి మృతి

image

మంచిర్యాల జిల్లా మందమర్రి ఫ్లైఓవర్ పైన బైక్ అదుపుతప్పి KK-OCPలారీ డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..షేక్ ముగ్ధం, షేక్ జిలాని ఇద్దరు అన్నదమ్ములు బైకుపై మంచిర్యాల వెళ్లి వారి మేనమామ ఇంటికి బెల్లం పల్లికి వెళుతుండగా మందమర్రి ఫ్లై ఓవర్ పైన జిలాని డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు. జిలాని అక్కడికక్కడే మృతి చెందాడు. మగ్గంకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News October 23, 2025

ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన గోదాములు, తూకం యంత్రాలు, తడి ధాన్యం ఆరబెట్టే వసతులు, రైతులకు తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 23, 2025

ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదల

image

ఆండ్ర జలాశయంలోకి గురువారం సాయంత్రం ఇన్ ఫ్లో 750 క్యూసెక్కుల వరద నీరు రావడంతో స్పిల్వే రెండో గేట్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని చంపావతి నదిలోకి విడుదల చేశామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చంపావతి నది పరివాహక ప్రాంతాలైన అనంతగిరి, మెంటాడ మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీటి మట్టం పెరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 23, 2025

HYD: నిమ్స్‌లో అత్యాధునిక శస్త్రచికిత్స పరికరాలు

image

HYD నిమ్స్ ఆస్పత్రిలోని శస్త్రచికిత్స గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేసింది. శస్త్రచికిత్స గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో రూ.2 కోట్ల విలువైన రెండు అధునాతన పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని డైరెక్టర్ ప్రొఫెసర్ నాగరి బీరప్ప ప్రారంభించారు. ఈ సాంకేతికతలు శస్త్రచికిత్సలో కచ్చితత్వం, రోగి భద్రత, క్లినికల్ సామర్థ్యాన్ని పెంచుతాయని ప్రొఫెసర్ పేర్కొన్నారు.