News January 30, 2025
బైరెడ్డిపల్లిలో విషాదం

చిన్నారి మృతి చెందిన ఘటన బైరెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. T.N.కుప్పం గ్రామానికి చెందిన రాజేశ్, రూప దంపతుల కుమార్తె వైష్ణవి(10) కి జ్వరం రావడంతో ఇద్దరు RMP డాక్టర్ల వద్ద చూపించారు. రెండు రోజులైన జ్వరం తగ్గకపోవడంతో పలమనేరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికి ఆమె ఆరోగ్యం క్షిణించిందని వైద్యులు సూచించారు. పెద్దాసుపత్రికి తరలిస్తుండగా చిన్నారి మృతి చెందింది.
Similar News
News February 8, 2025
చిత్తూరు: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

రైలులో గర్భిణిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన జోసెఫ్ భార్య 4నెలల గర్భిణి. ఆమె కోయంబత్తూరు- TPT ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పుట్టినిల్లు చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి బయలు దేరింది. వేలూరు జిల్లాకు చెందిన హేమరాజ్(28) మహిళా బోగిలో ఎక్కి ఆమె ఒంటరిగా ఉండడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశాడు.
News February 8, 2025
పవన్‌పై అభిమానం.. విజయవాడకు పయనం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో చిత్తూరు యువకుడు సాహసానికి శ్రీకారం చుట్టాడు. శాంతిపురం మండలం కోలాల తిమ్మనపల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు బాలకృష్ణ పుట్టుకతో దివ్యాంగుడు. పవన్‌కు అతను వీరాభిమాని. ఎలాగైనా అతడిని కలవాలన్న ఉద్దేశంతో మూడు చక్రాల సైకిల్‌పైనే విజయవాడకు పయనమయ్యాడు.
News February 7, 2025
అందాల పోటీల్లో చంద్రగిరి అమ్మాయికి కిరీటం.. CM ప్రశంస

మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు.