News February 6, 2025

బైరెడ్డిపల్లి: హైవేపై ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వి.కోట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లికి చెందిన మునెప్పగా గుర్తించారు. అతనికి మతిస్తిమితం సరిగా లేదని తెలుస్తోంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 7, 2025

మంత్రి నిమ్మలను కలిసిన ఇరికిపెంట మాజీ సర్పంచ్

image

సోమల మండలంలోని ఇరికిపెంట చిన్నపట్నం చెరువును అభివృద్ధి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడిని ఇరికిపెంట మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాయుడు కోరారు. గురువారం విజయవాడలో మంత్రిని కలిసిన ఆయన చెరువు కట్ట, తూములు, ఆయుకట్టు కాలువల అభివృద్ధికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. 6వ స్థానంలో CM చంద్రబాబు

image

CM చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబు ఇతర మంత్రులతోపోటీ పడి 6వ స్థానంలో నిలిచారు. కాగా చంద్రబాబు సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖను చూస్తున్న విషయం తెలిసిందే. మరింత వేగంగా పని చేయాలని CM మంత్రులను ఆదేశించారు.

News February 6, 2025

నీటి ఎద్దడిపై చిత్తూరు కలెక్టర్ సమీక్ష 

image

రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఈఓపీఆర్డీలతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు. అధికారులు నీటి ఎద్దడి గ్రామాల వివరాలను తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

error: Content is protected !!