News July 11, 2024

బైరెడ్డిపల్లె: ఎద్దు పొడిచి వ్యక్తి మృతి

image

ఎద్దు పొడిచి వ్యక్తి మృతి చెందిన ఘటన బైరెడ్డిపల్లెలో జరిగింది. బైరెడ్డిపల్లెకు చెందిన జయచంద్రానాయుడు(37) గ్రామ సమీపంలోని పొలం వద్దకు ఎధ్దును మేతకు తీసుకెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఎద్దు పొడిచింది. దీంతో తీవ్రగాయాలవ్వడంతో అక్కడి రైతులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్థానిక వైద్యాధికారి విజయచందర్ అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

Similar News

News February 14, 2025

చిత్తూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే, ఎంపీల చర్చలు

image

చిత్తూరు పార్లమెంటు కార్యాలయంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చిత్తూరు అభివృద్ధి పై చర్చించుకున్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉద్గాటించారు. 

News February 14, 2025

చిత్తూరు: ప్రేమికుల రోజే.. యువతి నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యం?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం యువతిపై అఘాయిత్యం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని ఇద్దరు వ్యక్తులు నిర్భంధించి దాడి చేశారు. ఆమెను కత్తులతో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 108లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 14, 2025

తిరుపతి: కిరణ్ రాయల్‌పై కేసు నమోదు

image

తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్‌పై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామయ్య కథనం ప్రకారం.. లక్ష్మీరెడ్డి గతంలోఎస్‌పీ హర్షవర్ధన్ రాజుకు కిరణ్ రాయల్‌పై ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు విచారించి గురువారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!