News June 20, 2024
బొండపల్లిలో మృతదేహం కలకలం

బొండపల్లి మండలంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన మజ్జి కృష్ణ (33) ఈనెల 17న తన భార్యను రూ.400 అడిగి బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. గురువారం రవీంద్రం గ్రామంలో విగతజీవిగా పడిఉన్న కృష్ణను స్థానికులు గుర్తించారు. ఘటనపై మృతిని భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్సై కే.లక్ష్మణరావు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 18, 2025
పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2025
ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

ఈ నెల 19వ తేదీ శుక్రవారం ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై ఈ గ్రీవెన్స్‌లో ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.
News September 17, 2025
VZM: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.