News January 14, 2025
బొండపల్లిలో లారీ బీభత్సం.. ఇద్దరు స్పాట్‌డెడ్

బొండపల్లి మండలంలోని గొట్లాం సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతి చెందిన వారిలో బొండపల్లి మండలం చందకపేటకు చెందిన లవణ్ కుమార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరొకరిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 28, 2025
గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్.. ఐదుగురికి అస్వస్థత

గుర్ల KGBVలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో డార్మిటరీలో పరుపులు తగలబడి పొగ వ్యాపించింది. మంటలు చెలరేగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలు చెందారు. అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని అంతా బయటకి వచ్చారు. ఈ ఘటనలో పొగ పీల్చిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే చికిత్స అందడంతో ఆరోగ్యం మెరుగుపడిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
News October 28, 2025
తుఫాన్ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం: VZM SP

మొంథా తుఫాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారని పేర్కొన్నారు. కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటేటప్పుడు ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని, ప్రజలకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News October 28, 2025
తప్పుడు వార్తలతో వైరల్ చేస్తే తప్పవు: ఎస్పీ

తుపాన్ నేపథ్యంలో తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తప్పవని SP ఏ ఆర్ దామోదర్ మంగళవారం హెచ్చరించారు. మొంధా తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


