News February 6, 2025

బొంరాస్‌పేట్: చెరువులో గల్లంతైన యువకుడి శవం లభ్యం

image

బొంరాస్‌పేట్ మండలం పెద్దచెరువులో మంగళవారం గల్లంతైన కుదురుమల్ల గ్రామానికి చెందిన యువకుడు రాజు(26) మృతదేహాం ఇవాళ ఉదయం తేలింది. మృతదేహాన్ని చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. అక్కడికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. 

Similar News

News July 6, 2025

7న ప్రజావాణి రద్దు: హనుమకొండ కలెక్టర్

image

హనుమకొండ కలెక్టరేట్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News July 6, 2025

‘అమెరికా పార్టీ’ స్థాపిస్తున్న ఎలాన్ మస్క్

image

‘బిగ్ బ్యూటీఫుల్ బిల్’ పాసైతే మూడో పొలిటికల్ పార్టీ పెడతానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో పార్టీపై ట్విట్టర్‌లో రెండోసారి పోల్ పెట్టగా.. 12.48 లక్షల ఓట్లొచ్చాయి. 65.4% మంది మూడో పార్టీకి ఓటేశారు. ఈ నేపథ్యంలోనే “రెండు పార్టీలు ఒక్కటే అన్న అభిప్రాయంతో మీరు కొత్త పార్టీ కోరుకుంటున్నారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకు ఇవాళ ‘అమెరికా పార్టీ’ రూపుదిద్దుకుంది’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

News July 6, 2025

బిక్కనూర్: TU సౌత్ క్యాంపస్‌ను సందర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్

image

బిక్కనూరు మండల పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
శనివారం సందర్శించారు. క్యాంపస్‌లోని వసతి గృహాలను పరిశీలించారు. అక్కడ విద్యార్థులు పొందుతున్న మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.