News July 11, 2024
బొంరాస్‌పేట: అండగా ఉంటాను, అధైర్య పడకు: కేటీఆర్

బొంరాస్ పేట మండలం BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర బాయి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాదులోని తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. అధైర్య పడకండి, నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మండల నాయకులు ఉన్నారు.
Similar News
News February 9, 2025
జడ్చర్ల: రేపటి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొననున్న ఎస్పీ

జడ్చర్ల సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి .జానకి పాల్గొననున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తారని, వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను తెలపాలని కోరారు.
News February 8, 2025
షాద్‌నగర్: 10న అప్రెంటిస్ షిప్ మేళా

షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10వ తేదీన అప్రెంటిస్ షిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గం.లకు కళాశాలలో ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News February 8, 2025
వనపర్తి: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 2వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరిన చంద్రమోహన్, లక్ష్మమ్మల కారు కొత్తకోట ముమ్మళ్లపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలు కాగా.. HYDలోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదైంది.