News August 7, 2024
బొకారో ఎక్స్ ప్రెస్ దారి మళ్లింపు

చెన్నై సెంట్రల్-బేసిన్ బ్రిడ్జి స్టేషన్ల మధ్య వంతెన పునర్నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే బొకారో ఎక్స్ప్రెస్ దారి మళ్లిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. అలప్పుజ-ధన్ బాద్ బొకారో ఎక్స్ప్రెస్ను ఈనెల 8,10,13, 15,17, 20,22, 24,27,29తేదీల్లో రెగ్యులర్ మార్గంలో కాకుండా వయా పొదనూర్,ఇరుగూర్, సూరత్కల్ స్టేషన్ల మీదుగా నడుస్తుందన్నారు. పొదనూర్లో హాల్ట్ కల్పించామన్నారు.
Similar News
News October 17, 2025
విశాఖలో యాక్సిడెంట్.. నవవధువు మృతి

విశాఖలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపుగా స్కూటీపై వెళ్తోన్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్లో RTC బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెదగంట్యాడ (M) సీతానగరానికి చెందిన ఉమాదేవి, పైడిరాజుకి 4 నెలల క్రితమే పెళ్లి అయింది.
News October 17, 2025
విశాఖ: చోరీ కేసులో అక్కాచెల్లెలు అరెస్ట్

చోరీ కేసులో అక్కాచెల్లెలును విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్నగర్లో ఉంటున్న నరసింహరావు ఇంట్లో అనకాపల్లి జిల్లా సోమలింగాపురానికి చెందిన నాగమణి పనిచేస్తోంది. ఈనెల ఒకటో తేదీన బీరువాలో చెవి దిద్దులు, పచ్చలహారం నాగమణి దొంగతనం చేసి తన చెల్లెలు మంగకు ఇచ్చింది. గమనించిన ఇంటి యజమాని నరసింగరావు దువ్వాడ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News October 17, 2025
విశాఖ: అక్టోబర్ 18న స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు

అక్టోబర్ 18న మూడవ శనివారం “CLEAN AIR” అనే కాన్సెప్ట్పై స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి క్లీన్ ఎయిర్ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఆరోజున శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.