News January 23, 2025
బొగాబొంద గ్రామంలో అత్యంత విషపూరితమైన పాము

మందస మండలం బొగాబంద గ్రామంలో అత్యంత విషపూరితమైన రణపస పాము కనిపించడం కలకలం రేపింది. స్థానికులు దానిని కొట్టి చంపారు. ఇది కరిస్తే కొద్ది రోజులకు శరీరంపై నల్ల, బంగారం వర్ణంలో మచ్చలు వస్తాయని, ఆపై శరీరం ముక్కలుగా రాలిపోతుందని స్థానికులు తెలిపారు. నల్లటి మచ్చలతో భయం గొలిపేలా ఉండే ఈ పాము శాస్త్రీయ నామం ‘బంగారస్ ఫాసియాటస్’.
Similar News
News October 27, 2025
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి పర్యటన

పోలాకి మండలం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర బాబు సోమవారం పరిశీలించారు. డీఎల్ పురంలో గ్రామస్థులతో మాట్లాడారు. అధికారుల ఆదేశాలను తప్పనిసరిగా అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కెవీ మహేశ్వర రెడ్డి, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News October 27, 2025
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి పేరు ఇదే..!

కేంద్ర పౌర విమానాయన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడికి నామకరణం మహోత్సవం ఢిల్లీలో ఆదివారం నిర్వహించారు. రామ్మోహన్ కుమారుడికి శివన్ ఎర్రం నాయుడు అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, జీఎంఆర్ సంస్థల అధినేత, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, ఎర్రం నాయుడు సోదరులు, కింజరాపు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
News October 27, 2025
ఎచ్చెర్ల: డా.బీ.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి సెలవులు

ఎచ్చెర్లలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి సోమ, మంగళవారం సెలవులు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బి.అడ్డయ్య వివరించారు. యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


