News June 26, 2024

బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం: తమ్మినేని

image

కేంద్రం బొగ్గు గనుల వేలం ద్వారా
ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ఇండియా కూటమి ఆధ్వర్వంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలన్నారు.

Similar News

News November 12, 2025

ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్‌లైన్‌లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.

News November 12, 2025

ఖమ్మం: బోనస్‌పై అనుమానం.. కొనుగోళ్లలో జాప్యం

image

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో విక్రయించిన ధాన్యానికి బోనస్ ఇంకా జమ కాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. మద్దతు ధరతో పాటు బోనస్ రావాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాల్సి ఉన్నా, బోనస్‌పై అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

News November 12, 2025

ఖమ్మం జిల్లాలో 10 నెలల్లో రూ. 14 కోట్లు దోపిడీ

image

ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలు హడలెత్తిస్తున్నాయి. గత 10 నెలల్లోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 330కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు జిల్లా వాసుల నుంచి ఏకంగా రూ. 14 కోట్లు దోచుకున్నారు. నష్టపోయిన 24 గంటల్లో ఫిర్యాదు చేయడంతో రూ. 4 కోట్లు రికవరీ అయింది. కొరియర్ వచ్చిందంటూ ఓటీపీ చెప్పించడం ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయి.