News September 2, 2024
బొత్సకు కేబినెట్ హోదా.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కేబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై కేబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్సకు అవసరమైన ప్రోటోకాల్, మర్యాదలు ఇవ్వాలని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 23, 2025
VZM: SC, ST అట్రాసిటీ కేసులపై కలెక్టర్ కీలక ప్రకటన

విజయనగరం జిల్లాలో SC, ST అట్రాసిటీ కేసులపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది 4వ త్రైమాసికంలో జిల్లాలో మొత్తం 17 కేసులు నమోదు కాగా, వాటిలో 14 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన కేసులు ట్రయల్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 49 కేసులకు సంబంధించి 68 మంది బాధితులకు రూ.58.54 లక్షలు చెల్లించినట్లు చెప్పారు.
News December 23, 2025
సివిల్ రైట్స్ డేకి డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలి: VZM కలెక్టర్

ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినం (సివిల్ రైట్స్ డే)కు డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రతి మండలంలో ఎస్‌హెచ్‌వో, తహశీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు.
News December 23, 2025
VZM: పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి

పది పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 297 పాఠశాలల్లో 16,240 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరవుతారని, వారందరూ ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపాలన్నారు.


