News September 2, 2024

బొత్సకు కేబినెట్ హోదా.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

image

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కేబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై కేబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్సకు అవసరమైన ప్రోటోకాల్, మర్యాదలు ఇవ్వాలని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 19, 2024

మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి: హౌసింగ్ ఎండి

image

జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్ల‌న్నింటినీ మార్చి నెలాఖ‌రులోగా శ‌త‌శాతం పూర్తిచేయాల‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజ‌నీర్ల‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల‌ను కాలవ్య‌వ‌ధి ప్ర‌కారం పూర్తిచేయాల‌ని స్ప‌ష్టంచేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన గుంక‌లాం తదితర ఇళ్ల కాల‌నీలను సంద‌ర్శించి ఇళ్ల నిర్మాణ ప్ర‌గ‌తిని ప‌రిశీలించారు.

News September 19, 2024

ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించండి: ఎంపీ

image

ఆంధ్ర- ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, కేంద్ర రోడ్డు రవాణా& హైవేస్ మంత్రికి గురువారం వినతిపత్రాలు అందజేశారు. రామభద్రపురం-రాయగడ రహదారిని విస్తరించాలని, అలాగే, ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉన్న కూనేరు-రాయగడ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు.

News September 19, 2024

వెయిట్ లిఫ్టింగ్‌లో నెల్లిమర్ల యువకుడికి బంగారు పతకాలు

image

ఫిజి దేశంలో జరుగుతున్న కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు జూనియర్, సీనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. మొత్తం 326 కేజీల బరువును ఎత్తి ఈ ఘనత సాధించాడు. SHARE IT..