News January 21, 2025
బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు హోం మంత్రి <<15209881>>అనిత కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో మాజీ మంత్రికి నిందితుడికి, సాక్షులకు తేడా తెలియడం లేదని విమర్శించారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
Similar News
News January 7, 2026
తప్పుడు రాతలు రాసే పోరాటం చేస్తా: మంత్రి లోకేశ్

తనను కించపరిచే విధంగా ఆర్టికల్ వేశారని ఆరోజు తను విశాఖలోనే లేనట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 6 సంవత్సరాలుగా ఈ కేసుపై పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తను విశాఖ వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనాలు వాడటం లేదని, పార్టీ కార్యాలయంలోనే బస చేస్తున్నట్లు చెప్పారు. వార్తలు రాసే ముందు క్లారిటీ తీసుకోవాలని.. తప్పుడు రాతలపై తాను ఎప్పుడూ పోరాడుతునే ఉంటానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
News January 7, 2026
ఏయూలో బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు

భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)కి చెందిన బిరాక్ (BIRAC) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయో నెస్ట్ (Bio NEST) బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు అమోదం లభించింది. 3 సంవత్సరాల కాలానికి మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ శతాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రవిశ్వవిద్యాలయం కిరీటంలో మరొక కలికితురాయిగా నిలవనుందని రిజిస్ట్రార్ తెలిపారు.
News January 7, 2026
విశాఖ: పరువు నష్టం దావా.. ఈనెల 21కి కేసు వాయిదా

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.


