News January 21, 2025
బొత్సకు హోం మంత్రి అనిత కౌంటర్

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు హోం మంత్రి <<15209881>>అనిత కౌంటర్<<>> ఇచ్చారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రామతీర్థం ఘటనలో మాజీ మంత్రికి నిందితుడికి, సాక్షులకు తేడా తెలియడం లేదని విమర్శించారు. ఘటనలో సాక్షిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని స్పష్టం చేశారు. తప్పు చేయని వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు.
Similar News
News February 18, 2025
విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ పత్రాలు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.
News February 18, 2025
కావ్యరచనకు ఆధ్యుడు వాల్మీకి మహర్షి: చాగంటి

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.
News February 17, 2025
విశాఖలో 54 ఫోన్ల రికవరీ

కదిలే రైళ్లు, ప్లాట్ ఫాం, వెయిటింగ్ హాలులో చోరీకి గురైన ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. రూ.10 లక్షల విలువైన 54ఫోన్లను రైల్వే డీఎస్ఆర్పీ పి.రామచంద్రరావు సూచనలతో సీఐ ధనుంజయ నాయుడు ఇవాళ విశాఖ రైల్వే స్టేషన్‌లో బాధితులకు అందించారు. వేర్వేరు సందర్భాల్లో మిస్ అయిన ఫోన్లు హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి రికవరీ చేశారు.