News August 11, 2024

బొత్స నామినేషన్‌కు డేట్ ఫిక్స్..!

image

విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 నుంచి నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. స్వీకరణకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బొత్స తన నామినేషన్ పత్రాలను సోమవారం సమర్పిస్తారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా కూటమి నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు.

Similar News

News December 18, 2025

VZM: జాతీయ స్థాయి పారా పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత

image

ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో జరుగబోయే పారా (దివ్యాంగుల) పవర్ లిఫ్టింగ్ జాతీయ స్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు అర్హత సాధించారు. ఈ విషయాన్ని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్‌ గురువారం తెలిపారు. జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ చాటి విజయనగరం జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు.

News December 18, 2025

VZM: కలెక్టర్ల సమావేశంలో మన కలెక్టర్ కీలక ప్రతిపాదన

image

ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో బుధవారం ఆయన ఈ ప్రతిపాదన చేశారు. పశుగ్రాస కేంద్రాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగి గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. 2016 నుంచి 2019 మధ్య ఈ పథకం అమలులో ఉన్నట్లు గుర్తు చేశారు.