News February 26, 2026

బొప్పాపూర్: ‘పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

image

పీఎంశ్రీ కింద ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్ లో అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత విద్యాలయంలో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించారు.

Similar News

News April 12, 2026

NZB: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టం: MP

image

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక ఘట్టమని, 2029 ఎన్నికల నాటికి వాటిని అమలు చేయబోతున్నామని NZB MP ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లపై చట్టం చేయబోతున్నారని అన్నారు. మహిళల 30 ఏళ్ల నిరీక్షణకు ప్రధాని మోదీ తెరదించారని, వారికి ఇంతకంటే పెద్ద పండుగ ఉండదని పేర్కొన్నారు.

News April 12, 2026

హుజూర్‌నగర్‌ విద్యార్థినికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్

image

హుజూర్‌నగర్‌కు చెందిన బోరెడ్డి వర్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వర్షిత అసాధారణ ప్రతిభపై తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షితను పలువురు ప్రముఖులు అభినందిస్తూ.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

News April 12, 2026

మెదక్: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మంగళపర్తిలో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన చాకలి సాయిరాం అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.