News April 10, 2024
బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

బొబ్బిలి – సీతానగరం రైల్వేస్టేషన్ల మధ్య చిన భోగిలి సమీపంలో, బుధవారం గుర్తు తెలియని మృతదేహాం లభ్యమయ్యిందని బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందారా, లేదా పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 4, 2026
బొండపల్లి నుంచి ‘ఢిల్లీ’ వరకు.. CRRI డైరెక్టర్గా డా.రవిశేఖర్

విజయనగరం జిల్లా బొండపల్లికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. చలుమూరి రవిశేఖర్ అరుదైన గౌరవం పొందారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక సీఎస్ఐఆర్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI) డైరెక్టర్గా జనవరి 2న బాధ్యతలు స్వీకరించారు. సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం జిల్లా వాసులకు ప్రేరణగా నిలిచింది. రవాణా రంగం, రోడ్డు భద్రతపై ఆయన పరిశోధనలు చేశారు.
News January 4, 2026
VZM: ఈ నెల 5 నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు

నవంబర్-2025 సెషన్కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి శనివారం తెలిపారు. అబ్జెక్టివ్ పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-5 గంటల వరకు జరుగుతాయని, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉదయం 10-01గం.ల వరకు, మధ్యాహ్నం 3-6 గం.ల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తేవాలన్నారు.