News June 2, 2024
బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం

బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాలు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.
Similar News
News November 19, 2025
సకాలంలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 19, 2025
డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి 7 రోజుల జైలు: SP

బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కేసును విచారించిన గజపతినగరం మెజిస్ట్రేట్ విజయ్ రాజ్ కుమార్ ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.