News August 1, 2024
బొబ్బిలిలో యాక్సిడెంట్.. బాలుడు మృతి

బొబ్బిలి 8వ వార్డు పరిధిలో బొబ్బిలి నుంచి రాజాం వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సైకిల్పై వెళుతున్న బాలుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలపై నుంచి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు గొల్లపల్లి జీ.ఎన్.ఎస్. స్కూల్లో చదువుతున్న మణికంఠగా స్థానికులు గుర్తించారు.
Similar News
News December 29, 2025
VZM: జిల్లా సమాఖ్య ద్వారా నర్సరీ మొక్కల విక్రయం

జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఇండోర్ మొక్కలు, ఫ్రూట్ ప్లాంట్స్ విక్రయానికి అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని కలెక్టరేట్లో మహిళ సమాఖ్య అధ్యక్షురాలు మాధవి సోమవారం కలెక్టర్ను కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 31 నుంచి జనవరి 15 వరకు తక్కువ ధరలకు నాణ్యమైన మొక్కలను విక్రయించనున్నట్లు ఆమె కలెక్టర్కు వివరించారు.
News December 29, 2025
PGRS ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కరించాం: VZM SP

2025లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా జిల్లాలో 2,038 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో 1,930 ఫిర్యాదులను పరిష్కరించామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. ఇంకా 108 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మొత్తం ఫిర్యాదుల్లో 95 శాతం పరిష్కారం జరిగిందని వెల్లడించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా భూవివాదాలు, కుటుంబ తగాదాలకు సంబంధించినవే ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.
News December 29, 2025
VZM: ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు

విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్లతో నిఘా పెట్టి ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 5 మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. అయ్యన్నపేట శివారు ప్రాంతం, కలెక్టర్ కార్యాలయం, పీజీఆర్ ఆసుపత్రి పరిసరాల్లో డ్రోన్ల సహాయంతో రైడ్స్ నిర్వహించామని చెప్పారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టేందుకు డ్రోన్ల వినియోగం కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.


