News June 4, 2024

బొబ్బిలి అడ్డా.. బేబినాయనదే

image

బొబ్బిలికి సంబంధించి 19 రౌండ్‌లలో లెక్కింపు పూర్తి కాగా TDP అభ్యర్థి బేబి నాయన ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచే తన ఆధిపత్యం చూపించిన బేబినాయన చివరి రౌండ్ వరకు అదే జోరును కొనసాగించారు. తన ప్రత్యర్థి శంబంగి చిన అప్పలనాయుడిపై 43,845 ఓట్ల తేడాతో గెలుపొందారు. YCP అభ్యర్థి అప్పలనాయుడికి 56,114 ఓట్లు పడగా.. బేబినాయనకి 99,959 ఓట్లు పడ్డాయి. దీంతో బొబ్బిలి కోటలో టీడీపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు.

Similar News

News December 5, 2025

1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

image

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.

News December 5, 2025

VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్‌రూమ్‌ల నిర్వహణకు టెండర్లు

image

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్‌ రూమ్‌ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్‌పై ప్రజలకు అవగాహన కల్పించండి: కలెక్టర్

image

జిల్లాలో స్క్రబ్ టైఫస్‌పై ప్రజల్లో భయం అవసరం లేదని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో శుక్రవారం తన ఛాంబర్‌లో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధని, లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ప్రజలు భయపడకుండా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.