News September 24, 2024
బొబ్బిలి చేరుకున్న మరో మెడికో సౌమ్య మృతదేహం

మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన ఇద్దరు మెడికల్ విద్యార్థులు ఆదివారం గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కొసిరెడ్డి సౌమ్య మృతదేహం బొబ్బిలి పట్టణానికి సోమవారం రాత్రి చేరుకుంది. సౌమ్య మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News January 7, 2026
VZM: సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం అమలుపై జేసీ సమీక్ష

విజయనగరం జిల్లాలో అమలవుతున్న సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం పనితీరుపై జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం నాణ్యతతో, సరైన మోతాదులో సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాల సరఫరాలో లోపాలు లేకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News January 7, 2026
అనుమానంతో హత్య.. భర్తకు జీవిత ఖైదు: VZM SP

భార్యపై వివాహేతర సంబంధం అనుమానంతో హత్య చేసిన కేసులో నిందితుడు చేమల చినకనకారావు (32)కి జీవిత ఖైదు, రూ.3,000 జరిమాన విధిస్తూ విజయనగరం 5వ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2024 మే 26న ఎస్.కోట మండలం కొత్త మరుపల్లిలో ఈ ఘటన జరిగింది. కేసు విచారణలో నేరం రుజువుకావడంతో శిక్ష ఖరారైందని SP దామోదర్ తెలిపారు. పీపీ, పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News January 7, 2026
మ్యుటేషన్స్ తిరస్కరణలు తగ్గాలి: VZM కలెక్టర్ ఆదేశాలు

తహశీల్దార్లు తిరస్కరించిన ప్రతి వినతిని ఆర్డీవోలు క్షుణ్ణంగా పరిశీలించి రోజువారీగా సమీక్షించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. జిల్లాలో మ్యుటేషన్స్ తిరస్కరణలు 33.77% ఉండటం ఆందోళనకరమని, వీటిని తగ్గించాలని ఆయన సూచించారు. పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని, పెండింగ్ కేసులు గడువు లోపలే పరిష్కరించాలని అన్నారు. ధాన్యం సేకరణ సంక్రాంతి లోపల పూర్తి చేయాలన్నారు.


