News July 13, 2024
బొబ్బిలి: పరీక్షలో పాస్ చేస్తామని రూ.12 లక్షలు టోకరా

పరీక్షల్లో తప్పినా పాస్ చేయించాక ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ముఠా రూ. 12 లక్షలు కొల్లగొట్టిన ఘటన బొబ్బిలిలో జరిగింది. విద్యార్థి రాజాంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. మే రెండో వారంలో ముఠా అతని తండ్రికి ఫోన్ చేసి పాస్ చేసి, ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేశారు. ఫలితాలు వెలువడడం ,మళ్లీ ఫెయిలవడంతో మోసపోయానని గ్రహించారు. దీనిపై శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News October 27, 2025
VZM: జర్మనీలో ఉద్యోగాలకు 30న జాబ్ మేళా

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. జర్మనీలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం అక్టోబర్ 30న విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.2.60 లక్షల వరకు టాక్స్ ఫ్రీ వేతనం, ఉచిత వసతి, వైద్యం, రవాణా సదుపాయం కల్పించబడుతుందని ఆయన తెలిపారు.
News October 27, 2025
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు

మొంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు చెసే విశాఖ – కోరాపుట్ – విశాఖ పాసింజర్&ఎక్సప్రెస్, గుంటూరు – రాయగడ – గుంటూరు ఎక్సప్రెస్‌ను రైల్వే అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవనుండటంతో రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్శియల్ మేనేజర్ చెప్పారు.
News October 27, 2025
వచ్చేనెల సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నవంబర్ 1, 2వ తేదీల్లో స్థానిక రాజీవ్ స్టేడియంలో జరుగనున్నాయని జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోటీలు జరుగుతాయని చెప్పారు. ముందుగా ప్రకటించిన తేదీలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేయబడినట్లు వివరించారు. అర్హులైన ఉద్యోగులు గమనించి ఈ పోటీలకు హాజరు కావాలని సూచించారు.


