News March 22, 2024

బొబ్బిలి: మూడురోజుల వ్యవధిలో అన్నదమ్ముల మృతి

image

గుండెపోటుతో బొబ్బిలిలో హోం గార్డు కెంగువ మహేష్ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మూడురోజులు క్రితం తమ్ముడు రామారావు మృతి చెందడంతో ఒత్తిడికి గురై తీవ్ర అస్వస్థత గురయ్యారు. కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా.. మూడు రోజులు వ్యవధిలో అన్నదమ్ములు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 17, 2026

ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

image

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.

News March 17, 2026

VZM: ‘మార్చి 28 వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయి’

image

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ నెల 28 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించారు. జిల్లాలోని 367 రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, సుమారు రూ.974 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.