News January 20, 2025
బొబ్బిలి: రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

డోంకినవలస-బొబ్బిలి రైల్వే స్టేషన్‌ల మధ్య, గొల్లాది రైల్వే గేట్ దగ్గరలో రైల్వే ట్రాక్ మధ్యలో మహిళ మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు మహిళ ఏదయినా గుర్తు తెలియని రైలు నుంచి జారి పడిపోవడం వల్ల గాని ఢీ కొట్టడం వల్లగాని తగిలిన గాయాలతో చనిపోయి ఉండవచ్చని తెలిపారు. విజయనగరం GRP SI V.బాలాజీరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులు

బొబ్బిలి పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీలో బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిందుతులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. నగల వ్యాపారి రవి ఇంటిలో ఈనెల 1న చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు రాయగడ వెళ్తుండగా 45తులాలను స్వాధీనం చేసుకుని ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఏ1 ముద్దాయి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
News February 12, 2025
ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలి: SP

మర్యాదకర ప్రవర్తనతో ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ప్రజలతో మంచిగా ప్రవర్తించి, పోలీసుశాఖ ప్రతిష్ఠతను పెంచాలన్నారు. స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు ఏ కారణంతో వచ్చింది తెలుసుకొని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని సూచించారు.
News February 12, 2025
VZM: జిల్లా ఎస్పీను సన్మానించిన పోలీస్ అధికారులు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌ను పోలీస్ అధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే అత్యధిక కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో డిస్పోజ్ చేయుటలోను, బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఇటీవల పొందారు. దీంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.