News February 10, 2025
బొబ్బిల్లంక: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
సీతానగరం మండలం చిన్నకొండేపూడి చెందిన దంతె ప్రసాద్ (24) బొబ్బిలంక వద్ద ప్రమాదవశాత్తు ట్రాలీ వెనుక చక్రంలో పడి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం బంధువులు ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తు బొబ్బిల్లంక వద్ద ట్రాలీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News February 11, 2025
పెరవలి: బర్డ్ ఫ్లూ.. ఇంటింటి సర్వే
తూ.గో జిల్లా పెరవలి మండలం కానూరు పరిధిలో కోళ్ల ఫామ్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో 10KMలలోపు ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా చికెన్ షాపులను కొన్ని రోజులు మూసివేయడంతో పాటు, అక్కడ పని వాళ్లకూ వైద్య పరీక్షించాలన్నారు. ప్రజలకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే కంట్రోల్ రూమ్ నంబరు 9542908025కు సమాచారం అందించాలన్నారు.
News February 11, 2025
అనపర్తి: ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడి వ్యక్తి మృతి
అనపర్తిలో ప్రమాదవశాత్తు లిఫ్టులో గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. అనపర్తికి చెందిన సూర్యనారాయణ(65) తన కుమారుడు భాస్కరరావు నివసిస్తున్న అపార్ట్మెంట్కి వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ తెరిచి ఉన్నది చూసుకోకుండా లిఫ్టు గుంతలో పడ్డాడు. విషయం యజమాని భాస్కరరావుకు తెలపగా, అతను వచ్చి చూసేసరికి సూర్యనారాయణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 11, 2025
మిర్తిపాడు కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ- తాహశీల్దార్
సీతానగరం మండలం మిర్తిపాడు మార్ని సత్యనారాయణ కోళ్ల ఫారంలో 8 వేల కోళ్లు మరణించగా బర్డ్ ఫ్లూగా నిర్ధారించామని తాహశీల్దార్ ఎ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కోళ్ల ఫారానికి కిలోమీటరు పరిధి ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించామని, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చికెన్ షాపుల్లో అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధించామన్నారు.