News February 15, 2025
బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ రవూఫ్పై విజయం సాధించారు.
Similar News
News November 20, 2025
హిడ్మా అనుచరుడికి 14 రోజుల రిమాండ్: రావులపాలెం CI

మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ను రావులపాలెంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు. సరోజ్.. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వచ్చారా? లేక ముందే ఇక్కడ తలదాచుకున్నారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సరోజ్ను కొత్తపేట కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతడిని RJY జైలుకు తరలించారు.
News November 20, 2025
తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్.. నలుగురి అరెస్ట్

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 3.05 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ప్రధాన పార్టీ మండల అధ్యక్షుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై దండుమల్కాపురం గ్రామానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త తహశీల్దార్ వీరబాయికి ఫిర్యాదు చేయగా.. తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు.
News November 20, 2025
HYD: హోటళ్లలో సర్వీస్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు..!

HYDలో అనేక హోటళ్లలో సర్వీస్ టాక్స్ పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయి. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు రెస్టారెంట్లు ఈ సర్వీస్ ఛార్జీని బిల్లుల్లో బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లులు రూ.5 వేల- రూ.20 వేల వరకు రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని కోరుతున్నారు.


