News February 25, 2025
బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

బొమ్మలరామారం పంచాయతీ కార్యదర్శిని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటిపన్ను రశీదులు ఆన్లైన్ చేయకుండా తప్పుదోవ పట్టించారనే విషయమై విచారణ అనంతరం చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 21, 2025
ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్ బ్యాటర్ దూరం?

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సభ్యుడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపారు. గత సీజన్లో LSG కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ను ఢిల్లీ రూ.14 కోట్లకు వేలంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే.
News March 21, 2025
ఎన్టీఆర్: ఆ పనులు ప్రారంభించి జిల్లాను కాపాడాలి

బుడమేరు వరద నిర్వహణ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.39.77 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగలేరు వద్ద బుడమేరు రెగ్యులేటర్ పనులు, డైవర్షన్ కెనాల్ పనులను ఈ నిధులతో చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పనులను త్వరితగతిన ప్రారంభించి, రానున్న వర్షాకాలంలో జిల్లాను వరద ముంపు నుంచి కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం కోరుతున్నారు.
News March 21, 2025
పత్రికల్లో కథనాలు తప్పా? నివేదికలు తప్పా?: సీతక్క

గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే తప్పా..? తప్పా? ఏ సమస్యలు లేవంటూ అధికారులు ఇస్తున్న నివేదికలు తప్పా? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.