News April 4, 2025
బొల్లాపల్లి: తల్లి తిట్టిందని కొట్టి చంపాడు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
కృష్ణా: త్వరలో సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టుల భర్తీ

కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ ఓటరు నమోదు అధికారుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డి.కె. బాలాజి తెలిపారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల పనుల పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారని కలెక్టర్ వివరించారు.
News November 27, 2025
HYD: SSC JE ఎగ్జామ్ దరఖాస్తు చేశారా!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజినీర్ (JE) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారికి HYD రీజియన్ అధికారి డా.ప్రసాద్ ముఖ్య సూచన చేశారు. ఎగ్జామ్స్ స్లాట్ సెలక్షన్ చేసుకుని అభ్యర్థులు లాగిన్ ఆప్షన్ ద్వారా ఫీడ్బ్యాక్ ఓపెన్ చేసి HYD ఎగ్జామ్ సిటీ లొకేషన్ ఎంచుకోవాలని సూచించారు. ఎంపిక కోసం DEC 28 వరకు గడువు ముగుస్తుందని తెలిపారు.
News November 27, 2025
HYD: సమయానికి MMTS రైల్వే సర్వీసులు

HYDలోని లింగంపల్లి సహా అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న MMTS రైల్వే సర్వీసులు సమయానికి అందుబాటులో ఉంటున్నాయని SCR రైల్వే అధికారులు తెలిపారు. 9 6% సమయపాలన పాటిస్తున్నట్లుగా రికార్డులో తెలిసిందని తెలిపారు. ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలిస్తూనే, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు వివరించారు.


