News April 4, 2025

బొల్లాపల్లి: తల్లి తిట్టిందని కొట్టి చంపాడు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలంలో కన్నతల్లిని కొడుకు హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు వెల్లటూరుకు చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. చిన్న కుమారుడు బాదరయ్యకు పెళ్లి కాలేదు. ఈ నేపథ్యంలో బాదరయ్యను తిడుతూ ఉండేది. పెళ్లి కావటం లేదనే అసంతృప్తి, తిట్టిందన్న కోపంతో బాదరయ్య తల్లి నిద్రిస్తుండగా రోకలి బండతో కొట్టి చంపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 19, 2025

GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News April 18, 2025

గుంటూరు: పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

image

గుంటూరులో ఓ యూట్యూబర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన యువతికి మార్చి 10న నల్లచెరువు 2వ లైనుకు చెందిన కైలాశ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, చేసుకోను అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బాధిత యువతి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 18, 2025

గుంటూరు: స్పోర్ట్స్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఎంఎస్‌సీ స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు డిఎస్ఈవో పి.నరసింహారెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు మే 2వ తేదీలోపు ‘ssc.nsnis.in’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!