News July 13, 2024

బోగత జలపాతం వెళ్ళేవారికి సీఐ కీలక సూచన

image

వాజేడు మండలం బోగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు సీఐ కుమార్ కీలక సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో జలపాతంలో వరద పెరుగుతుందని హెచ్చరించారు. పర్యాటకులు లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో అనేకమంది భోగత జలపాతంలో మునిగి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 17, 2025

వరంగల్: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

News October 15, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్‌పై సమీక్ష

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 15, 2025

చెక్ లిస్టులు సరి చూసుకోవాలి: డీఐఈఓ

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ప్రథమ, ద్వితీయ సం. విద్యార్థులు తమ వివరాలను సరి చూసుకునే సౌకర్యం కల్పించారని, విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింకు ద్వారా నేరుగా తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు.