News February 19, 2025

బోడుప్పల్: చెరువులు పూడ్చితే కాల్ చేయండి!

image

బోడుప్పల్, పోచారం, అన్నోజిగూడ, ఘట్కేసర్, నారపల్లి, జోడిమెట్ల, ప్రతాపసింగారం సహా అనేక ప్రాంతాల్లో చెరువులను పూడ్చేందుకు మట్టి పోస్తే తమకు ఫిర్యాదు చేయాలని హైడ్రా సూచించింది. చెరువును ఎవరైనా ఆక్రమిస్తున్నట్లు మీకు తెలిసిందా..? 9000113667కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపింది. చెరువుల్లో నిర్మాణపు వ్యర్థాలు పోసినా ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 27, 2025

SDPT: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

వికారాబాద్: యువకుడి ఆత్యహత్య

image

చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన బంట్వారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. యాచారం గ్రామానికి చెందిన సుడే మహిపాల్ రెడ్డి(35) ఇంటిదగ్గర వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై తాగిన మైకంలో ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

News March 27, 2025

హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్‌కు లేదు: జగన్

image

AP: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ‘ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కార్‌కు లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కార్ ఎంతో కృషి చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!