News February 6, 2025
బోథ్: వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్
బోథ్ మండలంలోని పిప్పలదరి గ్రామానికి చెందిన బండారి చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. మూడు రోజుల క్రితం నిందితుడు తన శనగ పంట చుట్టూ కరెంటు వైర్ అమర్చడంతో అతడి దగ్గర పని చేస్తున్న పాలేరు మేస్రం కృష్ణ విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.
Similar News
News February 6, 2025
మంచిర్యాల: షటిల్ ఆడుతూ గుండెపోటుతో అధ్యాపకుడి మృతి
మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకుడు బంధం బాపిరెడ్డి(50) గుండెపోటుతో ఈరోజు మరణించాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో నేటి ఉదయం షటిల్ ఆడుతున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మరణించినట్లుగా మృతుడి మిత్రులు తెలిపారు. అధ్యాపకుడి మృతిపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
News February 6, 2025
ఆదిలాబాద్‌లో చికెన్ ధరలు
ఆదిలాబాద్‌లో చికెన్ ధరలు యథావిధిగా ఉన్నాయి. నెల రోజుల క్రితం కిలో రూ.220కి పైగానే అమ్మారు. నేటి ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ KG రూ.200 నుంచి రూ.210, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఇంతకీ మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి.?
News February 6, 2025
ఆదిలాబాద్‌లో నూతన మండలం ప్రారంభం!
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు పాలనాధికారి శ్యామలాదేవి కలిసి ప్రారంభించారు. నూతన మండలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను త్వరలో పూర్తిచేస్తామన్నారు. సంబంధిత కార్యాలయాల నిర్మాణాలకు నివేదికలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ సహాయ పాలనాధికారి మాల్వియా, ఆర్డీఓ వినోద్ కుమార్ పాల్గొన్నారు.