News July 6, 2024
బోధన్: ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలి మృతి
ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బోధన్‌లో జరిగింది. సాలూరకు చెందిన లక్ష్మీ బాయ్(71) జూన్ నెల 28న హున్సాలోని కూతురు ఇంటికి వెళ్లింది. బాత్‌రూమ్‌కు వెళ్తుండగా నీళ్ల బకెట్ తగలడంతో నీళ్లు ఒంటిపై పడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం NZB ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI నాగనాథ్ తెలిపారు.
Similar News
News December 13, 2024
నేడు ఉమ్మడి NZB జిల్లాకు మంత్రుల రాక..
ఉమ్మడి NZB జిల్లాలో శుక్రవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
News December 13, 2024
నేడు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు మంత్రి ఉత్తమ్ రాక
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు హెలీకాప్టర్‌లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు చేరుకుని అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
News December 13, 2024
కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ సురేష్ శెట్కార్
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లిన సీఎం రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, సింగరేణి బొగ్గు గనులు, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో సీఎం చర్చించారు. కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ఉన్నారు.