News August 17, 2024

బోధన్ – కాచిగూడ రైలు పున: ప్రారంభం

image

బోధన్, కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు పున: ప్రారంభించారు. మూడు నెలల క్రితం ఈ రైలును రద్దు చేశారు. ఈ రైలు బోధన్ నుంచి కాచిగూడ, మహబూబ్‌గర్ మీదుగా గుంతకల్ వరకు నడుస్తుంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి కాచిగూడ స్టేషన్ మీదుగా 11 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బోధన్‌కు చేరుకుంటుంది.

Similar News

News November 18, 2025

నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

image

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.