News April 5, 2024

బోధన్: బాలుడి అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోసం బస్తీకి చెందిన రేణుక తన కొడుకు నాని(6)ని తీసుకుని రాకాసిపేటలో కూలీ పనికి వెళ్లింది. అక్కడ నాని ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో రేణుక బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News

News December 29, 2024

డిచ్పల్లి: ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికిన మహిళలు

image

జైలు నుంచి వచ్చాక తొలి సారిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం డిచ్పల్లికి రాగా అక్కడ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. హారతులిచ్చి తిలకందిద్దారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, విజి గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News December 29, 2024

రెంజల్: ఎంపీడీవో కార్యాలయంలో నాగుపాము

image

రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము దర్శనం ఇచ్చింది. కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బాత్‌రూమ్‌కి వెళ్లగా అక్కడ పాము కనిపించడంతో ఉద్యోగులకు తెలిపారు. మిగతా ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టె వారికి సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.

News December 29, 2024

నిజామాబాద్: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి.సాయన్న

image

నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి. సాయన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు జిల్లా సీఈఓగా ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డీఓ గా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీ పై నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు వచ్చారు.