News August 30, 2024

బోధన్: లాడ్జీలో యువతితో పట్టుబడ్డ కౌన్సిలర్.. బంధువుల దేహశుద్ధి

image

బోధన్ బస్ స్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఒక యువతితో బీఆర్ఎస్‌కి చెందిన బోధన్ మున్సిపల్ కౌన్సిలర్‌ను శుక్రవారం స్థానికులు పట్టుకున్నారు. దీనితో ఆ యువతి తల్లిదండ్రులు, బంధువులు ఆ కౌన్సిలర్‌కు దేహశుద్ధి చేసి కౌన్సిలర్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ నెల 7న బోధన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు మంగల్ పాడ్ వద్ద మైనర్‌తో పట్టుబడగా కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News September 15, 2024

NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహబ్ పహాడ్ లో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాబన్ సాహబ్ పహాడ్‌కుచెందిన షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఉన్న 2 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.

News September 15, 2024

రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు

image

రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News September 15, 2024

వినాయకుడికి పూజలు నిర్వహించిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

image

కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి పట్టణంలోని వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిని వినాయక మండప నిర్వాహకులు సన్మానించారు.