News March 16, 2025
బోధన్: షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన రాష్ట్ర మంత్రి

బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు రైతులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మహారాష్ట్రలోని సాంగ్లీ తాలూకాలో చెరుకు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సాంగ్లీలోని శ్రీదత్త షుగర్ ఫ్యాక్టరీ ఛైర్మన్ శ్రీగణపతి రావు పాటిల్, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
బాసర గోదావరిలో దూకిన మహిళ.. కాపాడిన స్థానికులు

బాసర గోదావరి నదిలో దూకి నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన సత్తేపల్లి లక్ష్మి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అటుగా వెళుతున్న స్థానికులు చెన్నాగౌడ్, సాజిత్, ముజ్జు గమనించి ఆ మహిళలను గోదావరినదిలో నుంచి బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News March 18, 2025
నాగన్ పల్లి పసుపు వాగులో గుర్తుతెలియని వ్యక్తి శవం

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగన్ పల్లి శివారులో గల పసుపు వాగులో సుమారు 40 నుంచి 50 ఏళ్ల వయసు గల మగ వ్యక్తి శవం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు బోధన్ రూరల్ ఎస్సై మచ్చందర్ రెడ్డి వెల్లడించారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.
News March 18, 2025
మహిళలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం: MLC కవిత

మహిళలకు మోసం చేశామని ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో ఆమె మహిళా వ్యతిరేక సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. స్వయంగా సీఎం అసెంబ్లీలో దురుసుగా మాట్లాడడమే కాకుండా స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయబోమని చెప్పకనే చెప్పారని ఆక్షేపించారు. కాంగ్రెస్ మెనిఫెస్టోలోని హామీలు విస్మరించిందని అన్నారు.